సి.పి.ఎం. నూతనకమిటి ఎన్నిక.

రామభద్రపురం:జనసేవ న్యూస్

స్థానిక మండల కేంద్రంలో సి.పిఎం.పార్టీ విసృతసమావేశంలోఆదివారంసి.పి.ఎం. జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆధ్వర్యంలో  మండల నూతన కమిటీ  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 మండల కార్యదర్శి గా బలస శ్రీనివాస రావు, సభ్యులుగా రవ్వధర్మారావు, సంజీవి, ఎర్రమ్ నాయుడు, లక్ష్మి లు  ఎన్నికయ్యారు.
            
 ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేకవిధానాలువలన ప్రజలపై ఎంతో భారం పడుతుందని, అలాగే నిత్యవసర సరుకు లు ధరలు పెంచి, అలాగే పెట్రోల్ డీజిల్ , గ్యాస్ ధరలు పెంచికరోనా కష్టకాలంలో ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేసిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వకుండా  ఉద్యోగులను నరక యాతనలోపెట్టింద ని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐద్వా అధ్యక్షురాలు ఇందిరా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.