గ్రామస్థాయిలో ఓటియస్ పై అవగాహన కల్పించండి యమ్పీడీఓ

జనసేవ న్యూస్ :రామభద్రపురం 

జగనన్న శాశ్వత గ్రుహ హక్కు పధకం అమలులో బాగంగా గ్రామాల్లో ఓటియస్ పై అవగాహన కల్పించి,సచివాలయాల పరిధిలో మంచి ఫలితాలు తీసుకురావాలని మండల పరిషత్ అభివ్రుధ్ది అధికారిణి రమామణి అన్నారు.

శనివారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో  మండలంలో గల పంచాయితీ కార్యదర్శులు, వీఆర్ఓలు,ఇంజనీరింగ్ సహాయకులతో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో గ్రుహ నిర్మాణ లబ్ధిదారులకు జగనన్న శాశ్వత గ్రుహ హక్కు పధకం వలన 1983నుండి వివిధ పధకాల కింద మంజూరైన గ్రుహాల బుుణాలు లక్షలాది రూపాయిలు పేరుకుపోయాయని,ఒకేసారి ఓటియస్ పధకం కింద ఇంటికి పదివేలు రూపాయిలు చెల్లిస్తే ప్రభుత్వమే దానిపై ఉన్న అప్పునంతటిని రద్దుచేసి,స్థానిక సచివాలయంలోనే గ్రుహ ప్రస్తుత యజమానిపేరున రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత గ్రుహ హక్కు కల్పిస్తారని తెలిపారు.

దీనివలన గత లబ్ధిదారుల దగ్గరనుండి ఎవరైన కొనుగోలు చేసిన,వారెవరైన మరణిస్తే వారి వారసులకు క్రమబద్ధీకరణ జరుగుతుందని అన్నారు.

ఇంతటి అద్భుతమైన ఈ పధకం వలన పేదలు వారి అవుసరాలకు మరల బ్యాంకుల నుండి అదే ఇండ్లపై బుుణాలు పొందడానికి అర్హులవుతారని,దీనిని సద్వినియోగము చేసుకోవాలని కోరారు.

గ్రామాల్లో దీనవలన కలిగే ఉపయోగాలను విరివిగా ప్రచారం చేసి,లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఓటియస్ ను వేగవంతం చేయడానికి క్రుషి చేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మండల తహశీల్దారు పి గణపతిరావు,హౌసింగ్ డిఈఈ అశోక్ కుమార్,ఏఈ వై.సత్యారావునాయుడు,కార్యాలయ సీనియర్ సహాయకుడు పూడి కిరణ్, సిబ్బంది షణ్ముఖ,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.