పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రేమ ఆసుపత్రి అధిపతిని సన్మానించిన విశాఖ జనసేన నాయకులు


విశాఖపట్నం, జనవరి30:
 వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి పద్మశ్రీ పొందిన  డాక్టర్ ఆదినారాయణను జనసేన నాయకులు సన్మానించారు.  ఆదివారం డాక్టర్ ఆదినారాయణ నివాసంలో  ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్,  ముఖ్య నేతలు సుందరపు విజయకుమార్, కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, పెసల శ్రీను మాట్లాడుతూ డాక్టర్ ఆదినారాయణ సేవలను కొనియాడారు. ప్రేమ ఆసుపత్రి అధినేతగా పేదలు పట్ల ఆయన చూపిన వైద్య సేవలకు పురస్కారమే పద్మశ్రీ అన్నారు.