ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు


ఆనందపురం:జనసేవ న్యూస్
           మండలంలోని వేములవలస గ్రామ సచివాలయం లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగి రఘురాం, ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్లు పతాకావిష్కరణ జరిపి మాట్లాడారు.

 దేశానికి  స్వాతంత్రం తీసుకొచ్చేందుకు కృషి చేసిన త్యాగమూర్తుల బలిదానాలను, వీరోచిత పోరాటాలను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన కృషి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

 దేశానికి ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం జనవరి 26న వచ్చిన రోజు గా పరిగణించి రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నమన్నారు. 

కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి త్యాగమూర్తుల కలలను సాకారం  చేద్దామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లంక కొండమ్మ, ఎంపీటీసీ కోరాడ సూర్యకుమారిలతోపాటు సచివాలయ సిబ్బంది, వార్డు మెంబర్లు,పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.