ఉద్యమం లో పాల్గొని విజయవంతం చేసిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు అభినందనలు -తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

 *విజయవాడ* : 
నేడు కలెక్టరేట్ లను ముట్టడించి అరేస్టైన ఉపాద్యాయిని,ఉపాధ్యాయులకు అభినందనలు. ముఖ్యంగా పెద్దసంఖ్యలో హాజరైన మహిళా ఉపాధ్యాయులకు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జేజేలు పలుకుచున్నది అని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యాక్షులు మూకల అప్పారావు తెలిపారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు ఏరులు, వాగులు,వంకలు ఏకమై మహా ప్రవాహమై ధరిత్రిని ముంచెత్తుతాయి. నది ఎక్కడ పుట్టి సాగరంలో సంగమం అవుతుంది. 

ఇవన్నీ సహజసూత్రాలు.వృత్తిదారుల హక్కుల కోసం సంఘాలు ఏర్పడ్డాయి.రకరకాల భావజాలాలు,నాయకత్వ విభేధాలధూ వలన సంఘాలు పుట్టుకొచ్చాయి.

కాని అందరూ ఐక్యమైనప్పుడే ఉదోగులు,ఉపాధ్యాయులు,కార్మికులు మరిరు పింఛనర్లకు పలు మేళ్ళు జరిగాయి.ఆ సహజ సూత్రమం వలన 4జెఏసి లు లేదా భిన్న భావజాలం గల సంఘాలను ఏకం చేశాయి.

ఆర్థిక నష్టం వలన మహిళలు ఉవ్వేత్తున ఎగసి పడ్డారు.అన్ని జిల్లా కేంద్రాలపై వేలాదిమంది దండెత్తారు.అయితే ఫ్యాప్టో పిలుపు అయినా దాదాపు మనుగడలో ఉన్న 43ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి.

రేపటి నుండి జెఏసి పిలుపు కార్యక్రమాలకు కూడా ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలి.

సాక్షి టివి మినహా దాదాపు అన్ని టివి లు వెనుకా ముందు లైవ్ ఇచ్చాయి.ఉద్యమంలో పాల్గొని అరెస్టులకు జడవని ఉపాధ్యాయ మిత్రులందరికి శతసహస్ర నమస్సులు,అభినందనలు.

సాక్షి టివి,పత్రికలను  ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మికులు మరియు పెన్షనర్లు ఏందుకు బహిష్కరించరాదో ఆత్మపరిశీలన చేసుకోగలరు.

     జెఎసి అన్ని కార్యక్రమాలకు, సమ్మెకు "సై" అంటూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మద్దతు పలుకుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడిపినేని వెంకట్రావు, ఇతర ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.