అభాగ్యుల ఆకలి తీర్చిన టీం తారక్ ట్రస్ట్ సభ్యులు

మధురవాడ జనసేవ న్యూస్ :-
            విశాఖపట్నం జిల్లా లో మధురవాడ లో గల నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను గుర్తుచేసుకొని నివాళి అర్పించారు. 
ఈ సందర్భంగా మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రయులకు, మతిస్థిమితం లేనివారికి, పుట్ పాత్ ల పై నివసిస్తున్న అభాగ్యులకు మధ్యాహ్న భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి వాళ్ళ ఆకలిని తీర్చారు.

 అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, తమ అభిమాన హీరో  జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు ఖాళీ సమయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సంవత్సరాల నుండి టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో  టీం తారక్ ట్రస్ట్ సభ్యులు ఓలేటి శ్రావణ్, లెంక సురేష్, తిరుపతి సాయి కుమార్, నాగిశెట్టి పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.