పాఠశాలల్లో కరోన కట్టడి చర్యలు చేపట్టాలి - టిఎన్ఎస్ఎఫ్

 *ఆనందపురం* :
                రాష్ట్రంలో కరోన మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోన సోకకుండా చర్యలు చేపట్టాలి అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ అన్నారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిని ఎస్.ఎస్.పద్మావతి గారికి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ మాట్లాడుతూ మన పక్క రాష్ట్రాల్లో కరోన మూడో వేవ్ దృష్ట్యా సెలవులు పొడిగిస్తే మన రాష్ట్రంలో మాత్రం వాటికి భిన్నంగా ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా పాఠశాలలు ప్రారంభించటం దురదృష్టకరం అని అన్నారు. 

ఈ విధంగా తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో రోజుకు వేలల్లో కేసులు నమోదు అవ్వటం వలన విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు.

 రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందని లెంక సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు కోరాడ వైకుంఠరావు, బూర్లు శ్రీను, బూర్లు రవి , బొద్దపు మోహన్ తదితరులు పాల్గొన్నారు.