కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టాలి యమ్పీడీఓ

రామభద్రపురం,జనవరి13:
    కరోనా వైరస్ విస్త్రుతమవుతుందని, ఒమిక్రాన్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని స్థానిక మండల పరిషత్ అభివ్రుధ్ది అధికారిణి రమామణి కోరారు.

గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 104 నిర్వహణలో ఉన్న కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి మండల స్థాయి 15మంది కోవిడ్ కంట్రోల్ కమిటీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ మరల విజ్రుంభిస్తుందని,దాని నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.

రెండు డోసులు పూర్తయినవారికి బూస్టర్ డోసు వేసే ఏర్పాటు చేయాలని అన్నారు.వాక్సినేషన్ శతశాతం పూర్తి చేయాలని వైద్యశాఖ సిబ్బందికి సూచనలిచ్చారు.

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ద్రుష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకుడు రామక్రిష్ణంరాజు,సిబ్బంది,104కోవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ ఆనందపురం