*పెందుర్తి* :
విశాఖ గోపాలపట్నం జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో బుధవారం నాడు జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ కప్పులను జివిఎంసి కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు,బెహరా విద్య సంస్థల అధినేత డాక్టర్ చైతన్య, జెశాప్ రాష్ట్ర అధ్యక్షులు సోడిశెట్టి దుర్గారావు, జేశాప్ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ కప్పులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ, వార్తలు సేకరణలో నిరంతరం కష్టపడుతూ, నిజాలు వెలికితీసే క్రమములో వారిప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టు సోదరుల ఆటవిడుపుకోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు.
వారిపడే ప్రతి నిమిషం శ్రమతో కూడుకుని ఉందని ఇటు ప్రభుత్వానికి అటు రాజకీయ నాయకులకు సమాజంలో జరిగే ప్రతీ ఒక్క చిన్న విషయాన్ని అక్షరూపంగా మలచి అందించేలనే తాపత్రయపడుతూ,విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. వారికి ఈ టోర్నమెంట్ ద్వారా మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందని దీని ద్వారా వారికి కొంత సమయం ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.
బెహరా విద్యాసంస్థల అధినేత డాక్టర్ చైతన్య మాట్లాడుతూ, జర్నలిస్టు సోదరులు అహర్నిశలు కష్టపడుతూ,సమాజసేవ చేస్తూ వారి కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా కరోనా కష్టకాలంలో ముందుండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ప్రజలకు అందించడంలో వారికి వారేసాటి అని అన్నారు. జర్నలిస్ట్ సోదరులకు క్రికెట్ టోర్నమెంట్ కు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని అన్నారు.
అలాగే వారికి ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉన్నాను అంటూ హామీ ఇచ్చారు. జేశాప్ రాష్ట్ర అధ్యక్షులు సోడి శెట్టి దుర్గారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతుంటాయని, సంక్రాంతి సంబరాల సందర్భంగా జర్నలిస్టుల మండలస్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని,
జర్నలిస్టుల క్రికెట్ పోటీలకు సహాయసహకారాలు అందించిన బెహరా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. జరగబోయే టోర్నమెంట్ వివరాలు రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు తెలుపుతూ, బుధవారం ఉదయం ఎనిమిదిగంటలకి మ్యాచ్ ప్రారంభం అవుతుందని, ఈపోటీలలో ఆరుజట్లు పాల్గొంటున్నాయని, ప్రతీమ్యాచ్ 10 ఓవర్లు వరకు జరుగుతుందని,ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం పరిగినలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
క్రీడాకారులకు ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, క్రీడల ప్రారంభోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కే.కే రాజు , బెహరా.
భాస్కర రావు, నార్త్ ఏసిపి శ్రీపాదరావు, గౌరవ అతిథులుగా జేశాప్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, పెందుర్తి సి.ఐ అశోక్ కుమార్, క్రైమ్ సిఐ లూధరన్ బాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, దాడి రవికుమార్ హాజరవుతారని, అలాగే సాయంత్రం జరగబోయే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు చేతులమీదగా విజేతలకు బహుమతులు అందజేయబడుతుంది.