ఆనందపురం : జనసేవ న్యూస్
అక్షయ పాత్ర ఫౌండేషన్ గంభీరం,విశాఖపట్నం జిల్లా వారి నిత్యావసరాల సరుకుల కిట్లులను (5 కిలోల బియ్యం,కిలో గోధుమ పిండి, కిలో కొమ్ము శెనగలు, కిలో పంచదార,1.5 కిలోల కంది పప్పు,లీటరు రిఫైన్డ్ నూనె, 200 గ్రాముల సాంబారు, 200 గ్రాముల పసుపు ) 100 మంది పేద ప్రజలకు పంపిణి చేయు కార్యక్రమం ఆనందపురం గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి చందక లక్ష్మీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆపరేషనల్ మేనేజర్ మఖన్ మాల్వియా, సాయి సర్పంచ్ చందక లక్ష్మీ గారి చేతులు మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చందక లక్ష్మి మాట్లాడుతూ,
ఈ కరోనా కష్ట కాలం లో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్న సేవను కొనియాడారు. నిత్యావసరాల కిట్లు పంపిణి చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సేవలు ఎనలేనివి అని గ్రామ సర్పంచ్ తెలిపిరి.
అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆపరేషనల్ మేనేజర్ మఖన్ మాల్వియా మాట్లాడుతూ, కరోనా 3 దశ వ్యాప్తి సందర్భంగా
కష్టకాలంలో వున్న వారి కొరకు తమవంతు ఉడతాభక్తి సహాయముగా సహకారముతో ప్రారంభిచడం జరిగింది అని, మరియు
ఈ కార్యక్రమము విజయవతము కావడానికి సహకరించిన దాతలకు మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ లో పనిచేయు వారికి , అక్షయ పాత్ర శ్రేయోబిలాషులకు, గ్రామ సర్పంచ్ కి, అధికారులకు, నాయకులకు హృదయ పూర్వ ధన్య వాదములు తెలిపారు .
ఈ కార్యక్రమంలో చందక లక్ష్మి, చందక సూరిబాబు, షిణగం చిన్న రామారావు, చందక అప్పలస్వామి, శంకర్, బాబి, సాయి,వర్డ్ మెంబర్లు, గ్రామస్తులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.