వేములవలస పాఠశాల దత్తత...! ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ స్పష్టీకరణ

ఆనందపురం:జనసేవ న్యూస్
 మండలంలోని వేములవలసలో గల ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి పరచడానికి దత్తత తీసుకున్నట్లు స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం పాఠశాలలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న ఆయనకు  ఉపాధ్యాయులు సమస్యలపై నివేదించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు.

 ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ముందుగా భోజన పథకము నకు అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

తన తండ్రి భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు ఆర్థిక సాయంతో 50 స్టీలు గ్లాసులు, 50 కంచాలు, నాలుగు కుర్చీలు, రెండు ఫ్యాన్లు సత్వరమే అందజేస్తామని హామీ ఇచ్చారు.కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ చూపిన చొరవకు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. 

ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీలత,  హేమలత, నదియా, విద్యా కమిటీ చైర్మన్ కొవ్వాడ లక్ష్మి, వార్డు మెంబర్ బోధ హైమావతిలతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.