ఓటీఎస్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి యమ్పీడీఓ రమామణిరామభద్రపురం

ఓటీఎస్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి యమ్పీడీఓ రమామణి
రామభద్రపురం: జనసేవ న్యూస్ 
ఓటీఎస్ లక్ష్యాల ప్రాప్తికి సంబంధిత ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎంపీడీఓ రమామణి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఓటీఎస్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువు లోగా పూర్తి చేయాలన్నారు. సంక్రాంతి పండుగ కు వచ్చే వలస కూలీలకు కూడ ఈ పథకం ప్రయోజనాలు వివరించి జగనన్న సంపూర్ణ గృహ హక్కు సదుపాయాన్ని వారికి వర్తింప జేయాలన్నారు. అలాగే ఇంతవరకు సాధించిన ప్రగతి పై సమాచారాన్ని సేకరించారు. అలసత్వం లేకుండా ప్రతీ లబ్ధిదారునికి అవగాహన కల్పించి ఈ పథకాన్ని వర్తింప జేయాలని సూచించారు. కోవిడ్, ఓమెక్రాన్ ప్రభావం తీవ్ర మోతున్న కారణంగా ప్రతీ పౌరుడు నిబంధనలు పాటిస్తూ మాస్కు,భౌతిక దూరం పాటించేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి పండగ కు వా వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని వైరస్ లక్షణాలు ఉన్న వారితో కలిసి ఉండకుండా తగు జాగర్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ ఈవో పాత్రో, గ్రామ సచివాలయం సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకుడు చొక్కాపు శ్రీరాములునాయుడు,పూడి కిరణ్,షణ్ముఖ,సంతోష్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ ఆనందపురం