ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

 నెక్కొండ జనసేవ న్యూస్  : 
                 విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటల వచ్చాయి.
వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. 

దీంతో ప్రమాదం తప్పింది. సాంకేతికలోపంతోనే మంటలు వచ్చినట్లు గుర్తించారు. 

ఈ ఘటనతో తొలుత రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

 ఆ తర్వాత చిన్నపాటి అగ్నిప్రమాదమేనని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. 

ఈ ఘటనతో రైలు అరగంట పాటు నెక్కొండలో నిలిచిపోయింది. అనంతరం యథావిధిగా బయల్దేరి వెళ్లింది.