*ఆనందపురం* : మండలంలోని కణమం పంచాయితీ ఎర్రవానిపాలెం గ్రామంలో ఉన్న ప్రాధమికి పాఠశాల శిథిలావస్థకు చేరడంతో గత కొన్ని రెండు ఏళ్ళుగా విద్యార్థులకు బడిలో చెప్పవలసిన పాఠాలను గుడిలో చెపుతున్నారు అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎస్.పద్మావతి గారికి వినతిపత్రం అందజేశారు.
ఇలా ఏళ్ళ తరబడి గుడి లో పాఠాలను చెప్పడం చూస్తుంటే మనం ఆధునిక కాలంలో లేము అని, రాష్ట్రం రోజు రోజూ కు వెనుకబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివలన విద్యార్థుల జీవితాలు తీవ్ర అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా మండలంలోని సుమారు 20 పాఠశాలల పరిస్థితి ఇలానే ఉందని, వెంటనే వీటిని పునఃనిర్మించాలని ఆయన కోరారు.
అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎస్.పద్మావతి గారు మాట్లాడుతూ ఇలాంటి భవనాలను గుర్తించి నూతన భవనాల మంజూరు కోసం నివేదిక పంపించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కోరాడ వైకుంఠ రావు తదితరులు పాల్గొన్నారు.