*విశాఖపట్నం* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగునాడు విద్యార్థి సమైక్య అధ్యక్షులు ఎం.వ్. ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మేరకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డు వై.యమ్.సి.ఏ వద్ద మన రాష్ట్రాన్ని మనమే బాగుచేసుకుందాం అనే నినాదం తో శ్రమదానం కార్యక్రమం తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిప్రదాత, మార్గదర్శి, భారత జీవన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యువ ఆధ్యాత్మిక వేత్త, శ్రీ వివేకానంద జయంతి నాడు ప్రతీ ఏటా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి కార్తీక్, రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్, విశాఖ పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్. రతన్ కాంత్, ప్రధాన కార్యదర్శి డీ. జోష్ యాదవ్ , నియోజకవర్గ అధ్యక్షుడు బొండా రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి బోచ్చ ప్రవీణ్ , భరత్ , కార్యనిర్వాహక కార్యదర్శి దుర్గా ప్రసాద్, విద్యార్థులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.