*విజయవాడ* : ప్రముఖ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ (LIC) ఇప్పటికే తమ కస్టమర్లకు, ఏంజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ క్రెడిట్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఎల్ఐసీ లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో రెండు కార్డులను తీసుకొచ్చింది. ఇక ఈ క్రెడిట్ కార్డుల కోసం కస్టమర్లు ఎలాంటి యాన్యువల్ ఫీజులు కానీ, మెంబర్‌షిప్ ఫీజు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎల్ఐసీ అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని సులభతరమైన ఈఎమ్ఐలకు కన్వర్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
ఇక కార్డుతో రూ. 100పై ఖర్చు చేస్తే డిలైట్ పాయింట్లను సైతం పొందవచ్చు. ఎల్ఐసీ కార్డులను పొందిన వారికి రూ. 5 లక్షల వరకు అస్యూర్డ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను కూడా అందించనున్నారు. ఇక ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ విషయానికొస్తే.. లూమిన్ క్రెడిట్ కార్డుకు రూ. 50 వేలు, ఎక్లాట్ క్రెడిట్ కార్డుకు రూ. 2 లక్షలుగా కేటాయించారు.
రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ పాలసీ దారులను ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. హౌజ్‌లోన్ వంటి ప్రయోజనాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఎల్ఐసీ తాజాగా పాలసీ హోల్డర్లకు మరో సదవకాశాన్ని తీసుకొచ్చింది.
తమ కస్టమర్లకు, ఏంజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రెడిట్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందనున్నాయి. ఎల్ఐసీ లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో రెండు కార్డులను తీసుకొచ్చింది. ఇక ఈ క్రెడిట్ కార్డుల కోసం కస్టమర్లు ఎలాంటి యాన్యువల్ ఫీజులు కానీ, మెంబర్‌షిప్ ఫీజు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎల్ఐసీ అందిస్తున్న ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని సులభతరమైన ఈఎమ్ఐలకు కన్వర్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.
ఇక కార్డుతో రూ. 100పై ఖర్చు చేస్తే డిలైట్ పాయింట్లను సైతం పొందవచ్చు. ఎల్ఐసీ కార్డులను పొందిన వారికి రూ. 5 లక్షల వరకు అస్యూర్డ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను కూడా అందించనున్నారు. ఇక ఈ క్రెడిట్ కార్డుల లిమిట్ విషయానికొస్తే.. లూమిన్ క్రెడిట్ కార్డుకు రూ. 50 వేలు, ఎక్లాట్ క్రెడిట్ కార్డుకు రూ. 2 లక్షలుగా కేటాయించారు. త్వరలో ఈ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది.