మాకు న్యాయం చేయాలంటూ విశాఖ సముద్ర తీరంలో మరిసారి ఆందోళనలు చేస్తున్న మత్స్యకారులు

*జాలరిపేట* : 
విశాఖపట్నం   తీరంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం సద్దుమణగడం లేదు. అరెస్ట్‌ చేసిన తమ వ్యక్తిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద సంఖ్యలో మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగి,
రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలను బహిష్కరిస్తున్నట్లు మత్స్యకార నేతలు ప్రకటించారు. తమ వారిని విడిచిపెట్టే వరకు చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన అనుమతి ప్రకారం రింగ్‌ వలల బోట్లతో చేపల వేట మొదలైంది. దీన్ని సాంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఈ క్రమంలో పెద్ద జాలారిపేట, చిన్న జాలారిపేట మత్స్యకారుల మధ్య రగడ మొదలైంది. రింగు వలలు ఉన్న బోట్లను సాంప్రదాయ మత్స్యకారులు త


 మొత్తం ఏడు బోట్లు బూడిదయ్యాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి వాసవానిపాలెం, జాలారిపేటలో 144 సెక్షన్‌ అమలు చేశారు.

ఈ నేపథ్యంలో మెరైన్‌ పోలీసులు రంగంలోకి దిగి పెద్ద జాలరిపేట సంఘానికి చెందిన కోశాధికారి పిల్లా నొకన్నను అరెస్ట్ చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మత్స్యకారులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు.

 పిల్లా నొకన్న కుటుంబ సభ్యలుతో పాటు తోటి మత్స్యకారులు పెద వాల్తేరు సర్కిల్‌ను దిగ్బంధించారు. 

ఆందోళన విరమించాల్సిందిగా ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్ఎన్ మూర్తి.. మత్స్యకారులతో చర్చలు జరుపుతున్నారు. నొకన్నను వదిలిపెట్టే వరకు చర్చలను బహిష్కరిస్తున్నట్లు మత్స్యకారులు ప్రకటించడంతో .. వివాదం మళ్లీ మొదటికొచ్చింది.