ఉరి వేసుకుని విద్యార్థి అనుమానాస్పద మృతి

            *పద్మనాభం* : విశాఖ జిల్లా పద్మనాభం లో ఉరి వేసుకుని విద్యార్థి మృతి చెందినట్లు పద్మనాభం పోలీసులు తెలిపారు.

  పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి సామయ్యవలస గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బూర్లు సాయికళ్యాణ్ (13) , పద్మనాభం బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. 

అయితే బుధవారం హాస్టల్ ఎదురుగా ఉన్న తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

విద్యార్థుల మధ్య గొడవలు ఏమైనా జరిగాయా ? లేదా వ్యక్తిగత కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నాడా అని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.