ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

ఆనందపురం:జనసేవ న్యూస్ 
 మండలంలోని లొడగలవానిపాలెం గ్రామంలోగల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ 15వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.  ఆలయ ధర్మకర్త బమ్మిడి సూర్యనారాయణ,

 బమ్మిడి ఉమ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన భీమిలి మాజీ ఏ.ఎం.సీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు మాట్లాడుతూ అందరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అన్నారు. 

గత 15 ఏళ్లుగా  నిర్విరామంగా ఆలయ వార్షికోత్సవం జరపుకోవటం వారి చిత్తశుద్ధికి మచ్చుతునకగా అభివర్ణించారు. అతనితోపాటు తన కుమారుడు వేములవలస ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, బమ్మిడి తారక్, బోద నారాయణప్పడు, బోద అప్పలరాజు , ఎర్రాజీ స్వామి నాయుడు, కోరాడ రమణ, నడిమింటి అప్పలరాజు లు పాల్గొన్నారు.

(జి. రవి కిషోర్ బ్యూరో చీఫ్ )