ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజ స్టాలిన్ ఆరోపణ

*ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ జె స్టాలిన్ ఆరోపణలు

కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అంబానీ అధానీ లు లాంటి ప్రైవేటు పారిశ్రామిక  వేత్తలకు జాతి సంపదను దారబోస్తోందని, ఇటు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఓ టి ఎస్, ఆస్థి పన్ను, చెత్త పన్ను తదితర పన్నులు అధికంగా ప్రజలపై భారం మోపుతూ పోటీపడి ప్రజల నడ్డి విరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎంసీ 72 వ వార్డు కార్పొరేటర్ ఎ జె స్టాలిన్ నిశితంగా విమర్శించారు.
మంగళవారం విశాఖ అల్లిపురం సీపీఐ కార్యాలయంలో జరిగిన నగర సమావేశంలో స్టాలిన్ పాల్గొని మాట్లాడుతూ సీపీఐ ఏర్పడ్డాక గడిచిన 96 సం"రాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడానికి, బ్యాంకులు జాతీయకరణకు, రాజబరణాలు రద్దుకు పేద ప్రజలుకు ఇల్లు, ఇళ్ళస్థలాలు దున్నే వాడికి భూమి ఇటువంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కృషి చేసినదని నిత్యం ప్రజలు సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పోరాడుతుందని, చీఫ్ లిక్కర్ 50 రూపాయలుకు సరఫరా చేస్తామని చెపుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కి సీపీఐ గురించి ఇంతకన్నా ఎక్కువ తెలియదనిఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం గౌరవం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లి అనేక త్యాగలతో సాదించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా ఆపాలని కోరారు.
నగర కార్యవర్గ సభ్యుడు కె సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నగర కార్యదర్శి ఎం పైడిరాజు, సహాయ కార్యదర్సులు కె సత్యాంజనేయ, ఎస్ కె రెహ్మాన్, జి రాంబాబు, ఆర్ శ్రీనివాసరావు,  పి చంద్రశేఖర్, పి పొలయ్య, పి ఈశ్వరరావు, జి వామనమూర్తి తదితరులతో పాటు పలువురు సమితి సభ్యులు, శాఖ కార్యదర్సులు పాల్గొన్నారు.