*ఆనందపురం* : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పి ఆర్ సి జీవోలను రద్దు చేయాలని కోరుతూ పి ఆర్ సి పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు వేములవలస వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిచారు.
ఈ సందర్భంగా పిఆర్ టియు నాయకులు కె. ఆర్.కె .రావు పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను దారుణంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గొట్టిపల్లి ప్రధాన ఉపాధ్యాయులు సన్యాసిరావు, వెల్లంకి ప్రధాన ఉపాధ్యాయులు బాబులాల్, ఏపిటిఎఫ్ మురళి, కె.ఎస్.వి.సత్యనారాయణ మరియు ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,
పిఆర్ టియు , ఏపిటిఎఫ్ మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.