ఒమైక్రోన్ పై అప్రమత్తత అవసరం

జనసేవ న్యూస్   :ఆనందపురం

     మండలంలోని వేములవలస పంచాయతీ లో గల ప్రజలకు కరోనా మూడో దశ ఒమైక్రోన్ పై స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ అప్రమత్తం చేస్తున్నారు. 

ఇంటింటి ప్రచారం చేపట్టి యువతీ యువకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తూ అలాగే రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని అప్రమత్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన 'జర్నలిస్ట్ పవర్' ప్రతినిధితో మాట్లాడుతూ కరోనా నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వేములవలస పూల మార్కెట్ లో రైతులు రద్దీతో ఉండడం వలన భౌతిక దూరం, మాస్కు తప్పనిసరిచేశామని అన్నారు. 

అందరూ ఆరోగ్యంగా ఉండాలని తపనతోనే కొన్ని ఆంక్షలు తప్పనిసరి చేయవలసి వచ్చిందని దీన్ని అందరూ అర్థం చేసుకొని పాటించాలని కోరారు.