ఎన్టీఆర్ చిత్రానికి విజయనగరం నేపథ్యం

యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. త్వరలో కొరటాల దర్శకత్వంలో 30వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. తదుపరిగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు కథకి ఎంతో ఇంప్రెస్ అయిన తారక్.. 

చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తారక్ ఇమేజ్ కు అనుగుణంగా యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన అదిరిపోయే కథాంశాన్ని రెడీ చేస్తున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందట. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విజయనగరం నేపథ్యంలో కథ నడుస్తుందని టాక్. ఆ ప్రాంతంలో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకొని ఈ కథాంశాన్ని రాసుకున్నాడట దర్శకుడు బుచ్చిబాబు. సరిగ్గా ఉప్పెన చిత్రాన్ని కూడా ఈ దర్శకుడు వాస్తవ సంఘటనల ఆధారంగానే మలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక పర్యటన వెలువడుతుంది. మరి ఈ సినిమాలో మెకోవర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.