వేముల వలస పంచాయతీలో ఈ బీసీ నేస్తం లబ్ధిదారులు వైయస్సార్ పార్టీకుటుంబం ఆధ్వర్యంలోజగనన్నకు పాలాభిషేకం వేడుకలు ఘనంగా చేశారు

 పంచాయతీలో జగన్ అన్న ప్రభుత్వం  ఇ బి సి నేస్తం ఇరవై మందికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఉదయం వేముల వలస సచివాలయం వద్ద అధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్న గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పలస్వామి నాయుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేటివరకు గత ముఖ్యమంత్రులకు భిన్నంగా తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి నీ మించి ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను రెండున్నర సంవత్సరాల కాలంలోనే తొంభై ఐదు శాతం పైగా నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అన్న గారు అని, అలాగే అవినీతికి తావులేకుండా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ వారి బ్యాంక్ అకౌంట్ లో నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. అలాగే నేడు  పెద్ద కులాలువారి కుటుంబాలు కూడా ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా వుండాలని అందరికి కూడా  ( రెడ్డి, కోమటి, బ్రాహ్మణ, కమ్మ తదితర ఒ సి కులాల వారికి) ఇ బి సి నేస్తం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది. ఈ సందర్బంగా వారందరూ జగన్ అన్న కు పాలాభిషేకం చేయడం జరిగింది. వారు అందరూ మా కష్టాలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అని జై జగన్ అన్న, జయహో జగన్ అన్న అని నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కోరాడ అచ్యుత సాధు రాంబాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ శివ, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ అప్పలరాజు, వాలంటీర్స్ శ్రీను, శివ, గణేష్, ప్రసాద్, వినోద్, ఇ బి సి నేస్తం లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.