రామభద్రపురం:జనసేవ న్యూస్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాడంగిలో బాగువలస గ్రామానికి చెందిన మరిపి సింహాచలం, ఉష దంపతులు శ్రీమతి తెంటు భారతి వర్ధంతి సందర్బంగా వారి జ్ఞాపకార్ధం పాఠశాలలో దివ్యాంగులకు అందుతున్న సేవలు తెలుసుకొని వారికి సాయం చేయాలనే ఉద్దేశ్యంతో 20 మంది దివ్యాంగ విద్యార్థులకు మరియు 100 మంది సాధారణ విద్యార్థులకు స్టీల్ కంచాలు వితరణ చేశారు.
ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు సిద్ధాంతం త్రినాథరావు మాట్లాడుతూ పాఠశాలలో చదువుచున్న దివ్యాంగ విద్యార్థులకు చాలామంది దాతలు సాయం చేయటం జరుగుతుంది .
అని మనసున్న దాతలు ముందుకు వచ్చి దివ్యాంగులకు, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు దాత మరిపి సింహాచలంకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పెద్దింటి రామారావు, ఎంపీపీ ప్రతినిధి తెంటు మధు చేతుల మీదుగా వితరణ చేసారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు కొల్లి ఈశ్వరరావు మరిపి సింహాచలం, ఉష, రమేష్,మోహన్, త్రినాథ ఈశ్వరరావు పాల్గొన్నారు.
(పి. రామకృష్ణ , రిపోర్టర్, రామభద్రపురం)