రివర్స్ పీఆర్సీ చేసిన ప్రభుత్వం రివర్స్ అవ్వడం ఖాయం ప్యాఫ్టో కన్వీనర్ బొప్పే రవి

రామభద్రపురం: జనసేవ న్యూస్ 
రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చరిత్రలో లిఖింపబడవలసిన రివర్స్ వేతన సవరణ చేయడం విడ్డూరంగా ఉందని,ఇదే విధంగా పాలన కొనసాగితే ప్రభుత్వం ఉద్యోగ,

ఉపాద్యాయ కార్మిక సంఘాల ఆగ్రహానికి గురయ్యి రివర్స్ అవ్వడం ఖాయమని మండల ఉపాద్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ బొప్పే రవికుమార్ అన్నారు.
మంగళవారం సాయంత్రం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ప్యాప్టో ఆద్వర్యంలో ఈ నెల 20 న జరగనున్న ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి సన్నద్ధం చేయడానికి సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యుటియఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఇవ్వవలసిన డిఏలు ఇవ్వకపోగా వాటిని ముక్కలు చేయడం,ఎప్పటికి ఎరియర్స్ చెల్లించకపోయే ప్రయత్నం జరగడం,గత పాలకులు ఎవ్వరూ చేయని వేతన సవరణ ఇంటి అద్దె భత్యం

 తగ్గించడం,పాదయాత్రలో సిపియస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఇపుడు దానిని పూర్తిగా మరిచిపోవడం చాలా అన్యాయమని,అన్ని సంఘాలు ఈ రివర్స్ పీఆర్సీని వ్యతిరేకిస్తూ పోరాటానికి సిద్ధమని అన్నారు.ఈనెల 20న జరగనున్న ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్యాప్టో నాయకులు యస్వీ అప్పలనాయుడు,కోట శ్రీరాములునాయుడు, గంగాధర్,శంకరరావు,అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొన్నారు.
రిపోర్టర్
జి రవి కిషోర్