టిడిపి బలోపేతానికి కృషి.......! కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్

ఆనందపురం : జనసేవ న్యూస్
                 భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం భీమిలి, పద్మనాభం,మండలాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని టిడిపి యువ నాయకుడు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.
                 తమ పార్టీలో ఎవరికీ ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కొంత మంది పని కల్పించుకుని తప్పుడు సంకేతాలు అందిస్తున్నారని తెలిపారు. టిడిపి అంటే భీమిలి నియోజకవర్గానికి కంచుకోటగా అభిప్రాయపడ్డారు. 
                  నాయకుల మధ్య వైరం లేపి పబ్బం గడుపుతున్న వారు మానసిక ఆనందాన్ని పొందుతున్నారని చెప్పారు. పార్టీలో ఎప్పటికీ కార్యకర్త స్థాయి నుండి పెద్ద కేడర్ నాయకులకు సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుదనే అన్నారు.

                  అతని క్రమశిక్షణలో గల పార్టీ శ్రేణులంతా ఉత్తేజంగా ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొని కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు.  సేవా కార్యక్రమాలతో పాటు మానవీయ సంబంధాలు కలిగిన వారితో మాట్లాడుతూ అందరినీ అక్కున చేర్చుకున్న పార్టీ తమదే అని కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.