మాస్క్ లేకపోతే ఫైన్ విధిస్తా...! ఎస్.ఐ కృష్ణమూర్తి.రామభద్రపురం:జనసేవ న్యూస్

మాస్క్ లేకపోతే ఫైన్ విధిస్తామని  ఎస్. ఐకృష్ణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక బై పాస్ రోడ్డు ఆవరణలో టీ షాప్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. కోవిడ్ మూడో దశ తీవ్రంగా ఉన్నందున భౌతిక దూరం పాటించి, మాస్కోఉండేటట్లు చూడాలని యజమాని కోరారు.

 అలాగే పలు వాహనాలను తనిఖీలు నిర్వహించి పేపర్లు సక్రమంగా ఉన్నాయా, లేవా, రోడ్డు ప్రమాదాల పై, కొవిడ్ పై సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. 

బహిరంగ ప్రదేశాలలో యువకులు గుమిగూడిఆటలు అడరాదని, మాస్క్ దంరించుకోవాలని కోరుతున్నామన్నారు. అలాగే ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నడిచేటప్పుడు వాహనాలు చూసుకోవాలని, పలు ప్రమాదాలకు గురికావద్దని కోరుతున్నామన్నారు.