రామభద్రపురం,జనవరి 13
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు బారులు తీరి ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.
మండల పరిధిలోని భూశాయవలసలో ధర్మకర్త కోరాడ శ్యామ్ ఆద్వర్యంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి గుడిలో ఉత్తర ద్వార దర్షనానికి ఏర్పాట్లు ఘనంగా చేసారు.
కరోనాను ద్రుష్టిలో పెట్టుకొని భక్తులను తగిన నిభందనలతో అనుమతించారు.అయినా చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్షనం చేసుకున్నారు.
అలాగే ఆరికతోట బీసీ కాలనీ లో వెలసిన శ్రీదేవి భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లో లక్షపత్రి పూజ నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు విశేషంగా పాల్గొని తరించారు.
5 గురు అర్చక స్వాములు అధ్వర్యంలో విశేష పూజలు,హోమాలు నిర్వహించి నారాయణ నామస్మరణ తో ఆకట్టు కున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి చిలుకూరి రవిశర్మ మాట్లాడుతూ అతి పవిత్ర మైన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ పూజ భక్తుల మనో భావాలు నెరవేర్చే శక్తి మంతమైనదని, వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కూడ లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయన్నారు.
శ్రీ మహా విష్ణువు కు ప్రీతి పాత్రమైన ధనుర్మాసం లో వచ్చే ఈ ఏకాదశి నాడు ఈ ఆలయం లో ఈ పూజలు,హోమాలు పరిపాటిగా జరుపుతున్నా మన్నారు.
అలాగే భోగీ పండుగ రోజున కూడ గోధా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అభిలసించారు.