ఘనంగా 73 వ గణతంత్ర వేడుకలు

రామభద్రపురం : జనసేవ న్యూస్ 
             జనవరి 26 స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై కృష్ణ మూర్తి, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మండల అధ్యక్షుడు చొక్కాపు లక్ష్మణరావు, తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పి.గణపతి రావు లు బుధవారం  73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండానుఎగుర వేశారు. అలాగే గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ను గురించి వివరించారు. 

విద్యార్థులు చే జాతీయ గీతం పాడించి బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమామణి, ఏ పీ ఎం రెడ్డి శ్రీరాములు, ఉపాధి హామీ పథకం పిఓ సుశీల, ఎం .ఈ. ఓ తిరుమల ప్రసాద్, పలువురు ఉద్యోగులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.