మొకర శ్రీనివాస్ ను EMMA విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు

అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది, ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (EMMA) విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల మొకర శ్రీనివాస్ ను  ప్రముఖ వైద్యులు, జిల్లా గ్రామీణ వైద్యులు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు.

గ్రామీణ వైద్యుల రాష్ట్ర ఫెడరేషన్ సెక్రటరీ జంగం జోషి అధ్యక్షతన విశాఖలో ఏర్పాటు చేసిన సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం  ఆత్మీయ కలయిక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ, ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ యన్ యల్ రావు, బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు M తిరుపతిరావు, విజయనగరం జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు గెద్ద చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

పి శ్రీనివాసరావు 
భీమిలి రిపోర్టర్