అక్రమ గొలుసు మద్యం విక్రయదారుల కు అపరాధ రుసుము


భీమునిపట్నం జనసేవ : 

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో భీమునిపట్నం పరిధిలో ఇద్దరు గొలుసు మద్యం విక్రయాలు దారులకు అపరాధ రుసుము విధించడం జరిగింది. 
భీమిలి పట్నం మండలం  ఆవనామాం గ్రామానికి చెందిన జీరు పైడి భాస్కర్ రెడ్డి కు భీమునిపట్నం తహసిల్దార్ ప్రథమ అపరాధ రుసుము కింద 30 వేల రూపాయలు ప్రభుత్వ చలానా విధించినట్లు తెలిపారు.

 అలాగే పద్మనాభం మండలం బాందేవుపురం గ్రామానికి చెందిన మాది రెడ్డి ముత్యాల నాయుడుకు పద్మనాభం తహసిల్దార్ 20 వేల రూపాయలు ప్రధమ అపరాధ రుసుము విధించినట్లు ఎస్ ఐ పద్మావతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడిన యెడల లక్ష రూపాయలు అపరాధ రుసుము ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించ పడుతుందని తెలిపారు.

భీమిలి రిపోర్టర్ 
పి శ్రీనివాసరావు