శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు నిర్వాసితుల కమిటీ కలవడం జరిగింది

మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు నిర్వాసితుల కమిటీ కలవడం జరిగింది .
ఈ సందర్భంగా నిర్వాసితులు తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని గౌరవ శాసనసభ్యులు వారిని కోరడమైనది తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలని భవిష్యత్ ప్రణాళికలు కార్యాచరణ చేసి సూచించాలని కోరడమైనది నిర్వాసితులు మొత్తం 16500 మందికి గాను ఎనిమిది వేల మందికి మాత్రమే ఉద్యోగ భద్రత కల్పించడం అయినది మిగిలిన 8500 మందికి ఉద్యోగాలు కల్పించి వలసి ఉన్నది  మరియు ఇతర సమస్యలపై పరిష్కార మార్గం చూపాలని శాసన సభ్యులని కోరడమైనది. 

 గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు నిర్వాసితుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలను పరిష్కరించటం తగు ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్ళుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు పితాని భాస్కర్ రావు, డి ఎస్ వి నరసింహారావు, అవతారం, ఈశ్వరరావు, సత్యనారాయణ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

పి శ్రీనివాసరావు 
భీమిలి రిపోర్టర్