సర్వీస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లు నడపక పోవటం వలన తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థులు - టిఎన్ఎస్ఎఫ్


 *ఆనందపురం* : ఆనందపురం - పెందుర్తి రహదారి మధ్య నడుస్తున్న ఏపిఎస్ఆర్టీసీ బస్సులు గత కొంత కాలంగా సర్వీసు రోడ్డులో కాకుండా హైవే లో వెళ్లి ఆపటం వలన ఆయా గ్రామాల్లో ఉండే ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలుగునాడు విద్యార్థి సమైక్య రాష్ట్ర అధికార ప్రతినిధి లెంక సురేష్ అన్నారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్ళకుండీలు కూడలి నుండి నిత్యం వేల మంది ప్రయాణికులు, విద్యార్థులు ప్రయాణం చేస్తూ ఉంటారు అని కానీ ప్రభుత్వ బస్సులు బ్రిడ్జి పై నుంచి హైవే లో వెళ్లిపోవటం వలన పరిసర గ్రామాల్లో ఉండే ప్రయాణికులు, 

చుట్టూ ఉండే ఆయా కళాశాలల విద్యార్థులు బస్సులో ప్రయాణించాలి అంటే కిలో మీటర్ నడిచి, బ్రిడ్జి పైకి వెళ్లి ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఇలా ఇబ్బందులు పడలేక చాలా మంది ప్రయాణికులు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారని, దీని వలన ప్రభుత్వ ఖజానాకు గండి పడే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు అని ఆయన అన్నారు.
 ఇక్కడ  బస్ స్టాప్ కూడా అందుబాటులో లేదు అని, వర్షాకాలం, ఎండాకాలం లో ప్రయాణికులు ఉండేందుకు సరైన స్థలం లేక మరింత ఇబ్బందులు పడుతున్నారు అని,

 దీని పై  వెంటనే ప్రభుత్వ పెద్దలు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కోరాడ వైకుంఠ రావు, బొద్దపు మోహన్ తదితరులు పాల్గొన్నారు.