ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాల పనులనుపర్యవేక్షిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం స్మార్ట్ సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పరిశీలిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. స్మార్ట్ సిటీలో భాగంగా ఉడా పార్కు, ఎన్ఏడీ ప్రాంతాల్లో సీఎం ప్రారంభించబోయే ప్రాజెక్టులను మంత్రి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గానే కాకుండా, పారిశ్రామికంగా, టూరిజంపరంగా కూడా అభివృద్ధి చెందే నగరమని అన్నారు. నగరాభివృద్దిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని అన్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లో భాగంగా 60.70 కోట్లతో నిర్మించిన అయిదు ప్రాజెక్టులను, ఎన్ఏడీలో 186 కోట్లతో నిర్మించిన ఏడు ప్రాజెక్టులను సీఎం ప్రారంభిస్తారని అన్నారు. సీఎం జగన్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో రాణిస్తోందని అన్నారు. మంత్రితోపాటు పర్యటించిన వారిలో జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమీషనర్ లక్ష్మీశ, వీఎంఆర్డీఏ కమిషనర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీవీ, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, జీవీఎంసీ కోఆప్షన్  సభ్యులు బెహర భాస్కర్, 
ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు