జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటితూరు భాషోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది


భాషోత్సవాలు ముగింపు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాటితూరు భాషోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది.

 ప్రధానోపాధ్యాయుల డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాతృభాషను ప్రతి ఒక్కరు కూడా పరిరక్షించుకోవాలని తెలిపారు. 
 మహాత్మా గాంధీ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మిగతా పెద్దలందరూ కూడా  వారి మాతృభాషలోనే ఎన్నో మంచి రచనలు చేశారని అదేవిధంగా భాష యొక్క ప్రాముఖ్యత అనగా సాంస్కృతిక వికాసానికి, వివేకానికి, మాతృభాష పునాది వంటిది అని తెలియజేశారు. 
సబ్జెక్టు ఉపాధ్యాయులు టి ఎస్ వి ప్రసాద్ రావు, ఎం శ్రీనివాసరావు, పి ఎస్ ఎస్ లక్ష్మి, విజయకుమారి, భాష యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకు వివరించారు పలు పోటీలలో  విజయం సాధించిన  పిల్లలందరినీ కూడా అభినందించారు. 
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అదనపు కార్యదర్శి టి ఎస్ వి ప్రసాదరావు మాట్లాడుతూ భాషోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ముందే  తేదీలతో కార్యచరణ ప్రకటించి జరిపినట్లయితే పిల్లల్లో సృజనాత్మక శక్తి, కార్యదక్షత, మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి అన్నారు . 

అదేవిధంగా  మ్యాథ్స్, సైన్స్ కు ఏ విధంగా అయితే బడ్జెట్ ని కేటాయిస్తున్నారో అదేవిధంగా తెలుగు, హిందీ ,ఇంగ్లీష్ ,కూడా బడ్జెట్ కేటాయించి నట్లయితే మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. 

అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగానే ఒక రోజున పుస్తక ప్రదర్శన కూడా నిర్వహించినట్లు అయితే చాలా బాగుంటుందని తెలిపారు. అలాగే అందరూ కూడా మాతృభాష , రాజభాష అయినటువంటి హిందీ , అంతర్జాతీయ భాష  అయినటువంటి ఇంగ్లీష్ కి కూడా డా ప్రాముఖ్యతను ఇవ్వాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ అప్పలనాయుడు, సునీత,  శేఖర్ , శ్రీదేవి , సత్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు

పీ శ్రీనివాస్ రావు భీమిలి రిపోర్టర్