నగరాభివృద్దిలో రాజస్థానీలు భాగస్వామ్యం కావాలి

పత్రికా ప్రకటన

నగరాభివృద్దిలో రాజస్థానీలు భాగస్వామ్యం కావాలి

విశాఖ నగర మేయర్ పిలుపు 

నగరాభివృద్దిలో రాజస్థానీలు భాగస్వామ్యం కావాలని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పిలుపునిచ్చారు. విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు జీవిస్తున్న మహా విశాఖ నగరంలో రాజస్థానీలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో తమ సహకారాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.

 అఖిల భారతీయ మార్వాడీ సమ్మేళన్ కు అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక్ మార్వాడీ సమ్మేళన్, విశాఖపట్నం మార్వాడీ సమ్మేళన్, రాజస్థాన్ సాంస్కృతిక మండల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్లు, చేతులు పంపిణీకి పేర్లు నమోదు, కొలతలు తీసుకునే ప్రక్రియను మేయర్ ప్రారంభించారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవనంలో  నిర్వహించిన రెండు రోజుల శిబిరాన్ని మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మార్వాడీలు, రాజస్థానీలు అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తారని కొనియాడారు. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ గౌరవ అతిధిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. 

ప్రేమ ఆసుపత్రి అధినేత డాక్టర్ సుంకరి ఆదినారాయణ, సి.ఎం.ఆర్. సంస్థల అధినేత మావురి వెంకట రమణ,స్వీట్ ఇండియా అధినేత అనిల్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక మార్వాడీ సమ్మేళన్ అధ్యక్షులు చాంద్ మాల్ అగర్వాల్, కార్యదర్శి పొదేశ్వర్ పురోహిత్, మార్వాడీ సమ్మేళన్ విశాఖ అధ్యక్షుడు బిజేంద్ర కుమార్ గుప్తా, కార్యదర్శి కృష్ణ సింగ్ రాజ్పురోహిత్, రాజస్థాన్ సాంస్కృతిక్ మండల్ అధ్యక్ష, కార్యదర్శులు శంకరలాల్ శర్మ, రూపేష్ కుమార్ గుప్తా, ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజేఎఫ్) ఎం. ఆర్. ఎం. వర్మ, ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ 
పి శ్రీనివాస రావు