ఏసీబీ వలలో విశాఖపట్నం జిల్లా, మహారాణి పేట మండల డిప్యూటీ తహసీల్దార్

    ఈ రోజు ది.13.12.2021 సుమారు సాయంత్రం 06:29 గంటలకు శ్రీ  బి రవి కుమార్,  

డిప్యూటీ తహశీల్దార్, మహారాణి పేట మండలం, విశాఖపట్నం జిల్లా అను నిందిత అధికారి, ఫిర్యాది అయిన శ్రీమతి యన్. అన్నపూర్ణ,  విశాఖపట్నం వాసి, విశాఖపట్నం  జిల్లా  

అను ఆమెకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయుటకు లంచంగా మొత్తం రూ. 3,00,000/- లకు గాను ఈ రోజు అడ్వాన్స్ గా రూ. 60,000/- రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా  విశాఖపట్నం జిల్లా, ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

పీ శ్రీనివాసరావు 
భీమిలి రిపోర్టర్