ఆజాది కా అమృత్" మహోత్సవాలలో భాగంగా 75 కోట్ల సూర్యనమస్కారాలకు శ్రీకారం

పత్రికా ప్రచురణార్థం

75 వసంతాల స్వాతంత్ర్య భారతావనికి గుర్తుగా " ఆజాది కా అమృత్ "  మహోత్సవాల్లో భాగంగా 75 కోట్ల సూర్య నమస్కారములు చేయ సంకల్పించి 30 రాష్ట్రాలలో 30 వేల విద్యాలయాల,  మూడు లక్షల మంది విద్యార్థులచే క్రీడా భారతి , పతంజలి యోగ,  ఆయుష్ మంత్రిత్వ శాఖ,  ఫిట్ ఇండియా,  గీతా పరివార్,  హార్ట్ ఫుల్ నెస్,  తదితర సంస్థల సంయుక్త నిర్వహణలో " భారతీయ ఆధ్యాత్మిక యోగ సాధకులు" 
 నేర్పిన సూర్యనమస్కారాలను చేసి ప్రపంచ రికార్డు సాధనలో భారత ప్రజలు విద్యార్థులు అందరూ పాలుపంచుకోవాలని నిర్ణయమైనదని ఆంధ్ర ప్రదేశ్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ సంరక్షకులు శ్రీరవి గారు తెలిపారు .విశాఖపట్నం జిల్లా భారత స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు టి ఎస్ వి ప్రసాద్ రావు మాట్లాడుతూ ముందుగా సూర్య నమస్కారాలు చేయువారు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు .75 సూర్యనమస్కార్. కామ్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. 

2022 జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 7వ తేదీ రథసప్తమి వరకు ఇరవై ఒక్క రోజుల పాటు రోజుకు 13 సార్లు సూర్యనమస్కారాలు చేయాలని,  వానిని వెబ్సైట్లో రోజు నమోదు చేసిన వారికి భారత ప్రభుత్వంచే ప్రశంసాపత్రం అందుతుందని తెలిపారు.  విద్యార్థులకు ఆయా ప్రశంసాపత్రం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వివరించారు. 

విశాఖజిల్లా పతంజలి యోగా సమితి అధ్యక్షులు బి.ప్రభాకర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పాఠశాల, కళాశాల, విద్యార్థులచే ఈ 75 కోట్ల సూర్యనమస్కార యజ్ఞంలో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పొందాలని,  భరతమాతకు 75 కోట్ల సూర్యనమస్కారాలను కానుకగ సమర్పించాలని కోరారు.

రిపోర్టర్ P. శ్రీనివాస్ రావు