విశాఖపట్నం ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అదే వేదిక నుండి 186 కోట్ల తో నిర్మించినఏడు ప్రాజెక్టులను ప్రారంభించారు*ఎన్ఏడీ ఫ్లై ఓవర్‌ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి*

**అదే వేదిక నుంచి రూ.186 కోట్ల విలువ గల 7 ప్రాజెక్టులు ప్రారంభం*

విశాఖపట్టణం, డిసెంబర్ 17 ః విశాఖ నగర వాసులు ఎదురు చూస్తున్న ఎన్ఏడీ ఫ్లై ఓవర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం జాతికి అంకితం చేశారు. దీనితో పాటు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వి.ఎం.ఆర్.డి.ఎ) ఆధ్వర్యంలో రూ.186 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ముందుగా ఆయన గన్నవరం నుంచి విశాఖపట్టణం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అర‌కు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, నర్సీపట్టణం ఎమ్మెల్యే సాయిశంకర్, అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్, పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, పాలకొండ, పాతపట్నం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు  ముఖ్యమంత్రిని కలిశారు. కాసేపు వారితో మాట్లాడిన అనంతరం ఎన్.ఎ.డి.కి చేరుకున్నారు. 

అక్క‌డ రూ.150 కోట్లు వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే రూ.7.60 కోట్లతో పిఠాపురం కాలనీలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను, రూ.7.55 కోట్లతో ఆనందరపురం జంక్షన్ నుంచి బోని వరకు 9 కి.మీ. మేర విస్తరించిన రోడ్డును, 7.50 కోట్లతో అభివృద్ధి చేసిన పెదరుషికొండ - బీచ్ మాస్టర్ ప్లాన్ రోడ్డును, 6.97 కోట్లతో అభివృద్ధి చేసిన విశాఖ వ్యాలీ రోడ్డును, 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కల్యాణ మండపాన్ని, 1.56 కోట్లతో తాడిచెట్లపాలెంలోని ధర్మానగర్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎన్.ఎ.డి. వేదికగా మీట నొక్కి ప్రారంభించారు.

కార్యక్రమంలో ఉప ముఖ్య‌మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఛీప్ విప్ బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, స్థానిక ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, బీవీ సత్యవతి, డిప్యూటీ మేయ‌ర్ బి. శ్రీ‌ధ‌ర్‌, ఎమ్మెల్యేలు జి. అమ‌ర్ నాథ్‌, టి. నాగిరెడ్డి, క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ‌, ఎ. అదీప్ రాజు, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరదు కళ్యాణి, వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్‌, కలెక్టర్ మల్లిఖార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా, వీఎంఆర్డీఏ కమిషనర్ వెంకట రమణా రెడ్డి, వివిధ కార్పొరేష‌న్లు ఛైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, జీవీఎంసీ కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

.........................
జారీ, ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్టణం.