జర్నలిస్టుల సమస్యల సత్వర పరిష్కారం కొరకు సీఎం ఇల్లు ముట్టడి... జూపూడి గురుకాంతాచారి

సీఎం జగన్ ఇంటి ముట్టడికి గ.లమెత్తనున్న జర్నలిస్ట్ లు...........

పాదయాత్రలో ఇచ్చిన "మాట" తప్పి మడమ తిప్పిన సీఎం జగన్....

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కేబుల్ ఛానల్స్ కి అక్క్రిడెషన్ లు మంజూరు చేయని జగన్ సర్కార్.....


ప్రకాశం :- అయ్యా "సార్"నా పేరు జూపూడి గురుకాంతా చారి నేను 12 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జర్నలిజం లో ఉన్నాను సీఎం జగన్ గారు మా  ప్రకాశం జిల్లాలో 2018లో మార్చి 8వ తేదీన పాదయాత్రలో నాకు మీరు చిన్నారి కట్లలో పాదయాత్ర లో ఇచ్చిన మాట జర్నలిస్ట్ లందరికి అక్క్రిడెషన్లు, హెల్త్ కార్డులు, టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా జర్నలిస్ట్ లందరికి  మంజూరు చేస్తాం అని తెలిపారు.నేను మీ పాదయాత్ర లో మా యూనియన్  లెటర్ మీకు ఇచ్చినప్పుడు పాదయాత్ర లోనే ఆ లెటర్ ని చదివి జర్నలిస్ట్ లందరికి ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు ఇస్తానని నాకు మాట ఇచ్చారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి రెండున్నారేళ్లు అయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం లో రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది దాక జర్నలిస్ట్ లకు అక్క్రిడెషన్ లు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మందికి అక్క్రిడెషన్లు ఇచ్చారు. కేబుల్ ఛానల్స్ కి ఇంకా ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అక్క్రిడెషన్ కార్డు లు ఇవ్వలేదు 142 Go ప్రకారం కూడా అక్క్రిడెషన్లు ఇవ్వకుండా అధికారులు ఆ జీవో పై సరైన అవగాహన లేకుండా జర్నలిస్ట్ లను గందరగోళం చేస్తున్నారు.అసలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్ట్ ల సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో లేదో మాకు అర్ధం కావడం లేదు. మేము మంత్రులను, సలహాదారులు సజ్జల రామకృష్ణరెడ్డి దృష్టికి మా సమస్యలగురించి ఎన్నిసార్లు విన్నవించిన మా సమస్యలు సమస్యలాగానే ఉంది. కావున మేము మీ ఆపాయింట్ కోసం రెండు సంవత్సరాలనుండి చేయని ప్రయత్నం లేదు త్వరలో మేము మీ ఇంటిని ముట్టడించి మా సమస్యలపై గలమెత్తాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించుకున్నాము. మీరు వస్తే జర్నలిస్ట్ ల సమస్యలు తీరుతాయి అని ఆశపడ్డాము కానీ ఉన్న కార్డు లు పోయాయి. మీరు తెచ్చిన 142 జీవో లో 10వ కాలం లో రన్నింగ్ కేబుల్ అని ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవో చదవదానికిరాని అధికారులు సొంత కేబుల్ ఉండాలని చెపుతున్నారు.ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ లకి ఏమి చేయలేనిదని ఆఖరికి గుర్తింపు కార్డులు కేబుల్ ఛానల్స్ కి కొత్త కార్డులు కూడా మంజూరు చేయలేని అసమర్ధతతో ఉందని అవగాహన అవుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ ల ఐక్య కార్యాచరణ కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము.
"జర్నలిస్ట్" జూపూడి గురుకాంతాచారి ప్రకాశం cell 9959816391,9491111391