జర్నలిస్ట్ లందరికి అక్క్రిడేషన్స్. ఐ &పి ఆ ర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి

*జిల్లాలోజర్నలిస్టుల పై ఐ&పిఆర్ కమీషనర్ విజయకుమార్ రెడ్డి*ప్రత్యేక ద్రుష్టి 
*ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్& రిపోర్టర్స్ యూనియన్* చేసిన విజ్ఞప్తి మేరకు జర్నలిస్టులు,స్ధానిక పత్రికల సంపాదకులు పడుతున్న తాజా ఇబ్బందులపై రాష్ట్ర,జిల్లా యూనియన్ నేతలు సమాచార శాఖ కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు...దీనిలో భాగంగా జర్నలిస్టుల కి అక్రిడేషన్ 2వ లిస్ట్..చిన్న పత్రికలకి,లోకల్ ఛానెల్ లకి అక్రిడేషన్ జాప్యం పై వారిని  కలవడం జరిగింది.... దీనిపై  వెంటనే DD,Dpro తో మాట్లాడి తక్షణమే పెండింగులో ఉన్న అక్రిడేషన్ జాబితా ఫైనల్ చేయాలని.కమిషనర్ ఆదేశించారు.... ఈ రోజు రేపటికల్లా సమావేశాలు నిర్వహించి మొదటి వారంలో అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయమని ఆదేశించారు.ఎవరు కూడా ఆందోళనలు చెందవద్దని తెలిపారు,వచ్చే నెల మొదటి వారంలో కార్డులు తీసుకునేవారికి ఏప్రియల్ 30 వరకు ఇస్తారని కమిషనర్ హామీ ఇచ్చారు.

కొందరు సంపాదకులు నెల గడచి పోయింది 5 నెలలకే అక్రిడేషన్ ఇస్తారని ఆందోళన చెందుతున్న నేపధ్యంలో,అలా జరగదని ఇప్పుడు అక్రిడేషన్ తీసుకునేవారికి కూడా 6 నెలలు అక్రిడేషన్ ఇవ్వటం జరుగుతుందని సమాచార శాఖ కమిషనరేట్ అధికారులు హామీఇచ్చారు.ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు సాంబశివ నాయుడు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.