రాబోయే రోజుల్లో పోలవరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు.
ఈ మేరకు పాపికొండలు బోటింగ్ ను మంత్రి గారు పునఃప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోచమ్మ ఆలయం వద్ద ఉన్న బోట్ పాయింట్ వద్ద పాపికొండలు విహారాయత్రను మంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. టూరిజంకు చెందిన రెండు బొట్లు ను
మంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు..ప్రభుత్వానికి చెందిన రెండు బోట్లు సహా, ప్రైవేట్ సంస్థలకు చెందిన 9 బొట్లను గోదావరి నదిలో విహారాయత్రకు అనుమతులు ఇచ్చినట్టు మంత్రి గారు తెలిపారు. ఈ సంధర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం
తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్స్ పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, టూరిజం శాఖల
అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని బోటింగ్ ప్రారంభించామని అన్నారు. ఎప్పటికప్పుడు సాటిలైట్ సైటీమ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ మోనేటరింగ్ ఉంటుందని అన్నారు, టూరిజం బోట్లతోపాటు ఒక ఎస్కార్ట్ బోట్, సాటిలైట్ ఫోన్ సౌకర్యం, జీపీఎస్ ద్వారా బోటింగ్ పర్యవేక్షిస్తూ బోటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గారు అన్నారు. రూ.1250 టికెట్ తో కూడిన ఈ విహారయత్రలో టిఫిన్, భోజనం, స్నాక్స్ అందిస్తారని మంత్రి గారు అన్నారు. త్వరలోనే మిగిలిన బొట్లకు పర్మిషన్లు ఇస్తామని మంత్రి గారు అన్నారు. రోడ్డు సౌకర్యం కూడా మెరుగుపరచి టూరిస్టులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. ఈసందర్భంగా బొట్లలో టూరిస్టులతో మాట్లాడారు. టూర్ మొత్తం లైఫ్ జాకెట్లు ధరించాలని.. విహారయత్రను సక్సెస్ చేసుకోవాలని మంత్రి గారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ అరిమండ వరప్రసాద రావు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, టూరిజం, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్లాట్ అమ్మబడును పీఎం పాలెం
సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల