జర్నలిస్టుల హక్కులకై పోరాటం విశాఖపట్నం వేదికగా నిరాహార దీక్ష

జర్నలిస్టులపై వివక్షా...సిగ్గు సిగ్గు
- ప్రభుత్వ వైఖరి మారే వరకు దశలవారీ పోరాటం

-ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు

(విశాఖపట్నం - నవంబర్ 23)

జర్నలిస్టుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించేంత వరకు  ఉద్యమం కొనసాగిస్తామని ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు..మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏ.పి.యు.డబ్ల్యూ.జే విశాఖ నగర, రూరల్ యూనిట్స్ ఆధ్వర్యంలో జరిగిన నిరాహారదీక్ష లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా అమలు చేయకుండా తాస్తారం చేస్తోందని అన్నారు..కరోనాతో  మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం  అనుసరిస్తున్న  సాచివేత వైఖరిపై  తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు.దేశంలో పలు రాష్ట్రాలలో రాష్ట్ర  ప్రభుత్వాలు కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు ఇప్పటికే ఆర్థికసహాయాన్ని అందజేసాయని,  మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5లక్షల రూపాయల ఆర్థికసహాయం అంద చేస్తామని జీవో జారీచేసి  వెనకడుగు వేయడం విచారకరమని అన్నారు.కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తక్షణ ఉపశమనం కోసం ఆర్థికసహాయం వెంటనే అందచేయాలని  డిమాండ్ చేసారు.జర్నలిస్టుల ప్రమాద భీమా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు..రాష్ట్రంలో అక్రెడిటేషన్ జారీప్రక్రియ  జరుగుతున్న  తీరుపై కూడా  తీవ్రఅసంతృప్తి  వ్యక్తం చేస్తున్నామన్నారు.
జి.ఎస్టీ.పేరుతో పలుపత్రికల, న్యూస్ ఏజెన్సీల విలేఖరులు, ట్రాయ్ రిజిస్ట్రేషన్ పేరుతో సిటీకేబుళ్ళ  సిబ్బంది, వయో పరిమితి పేరుతో వెటరన్ జర్నలిస్టులు  అక్రిడేషన్లు    పొందలేకపోయామని అన్నారు..అక్రిడేషన్ జారీ ఒక నిరంతర ప్రక్రియ అని చెబుతూ  వచ్చిన అధికారులు అర్హులైన వారికి అక్రెడిటేషన్ జారీచేయడంలో  తీవ్రజాప్యం  చేయడంపై  దారుణమని అన్నారు..గతసంవత్సరం ఆగస్టులో గడువు ముగిసిన జర్నలిస్టుల  ప్రమాదబీమా  పథకం పునరుద్ధరించక  పోవడంపై కూడా  ఏ.పి.యు.డబ్ల్యూ.జే. తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నామని అన్నారు..ప్రమాదంలో మరణించిన జర్నలిస్టు ల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నారు..
సమాచార , పౌర సంబంధాలశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ మీడియా సలహాదారులు జర్నలిస్టు సమస్యల పరిష్కారం విషయంలో    ఇచ్చినహామీలు  ఆచరణలో  అమలుకావడం  లేదని  విమర్శించారు.కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు, వృత్తిపరమైన  సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన జిఓ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమానికి ముందు  గాంధీ విగ్రహానికి ఏపీయూడబ్ల్యూజే ఐవీ సుబ్బారావు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి రాము, విశాఖ నగర ప్రధాన కార్యదర్శి కె.చంద్రమోహన్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి బంగారు అశోక్ కుమార్, రూరల్ కార్యదర్శి  జోగి నాయుడు, ఉపాధ్యక్షులు
విస్సాకుమార్, కిల్లి ప్రకాష్,కార్య నిర్వాహక కార్యదర్శి కెఎస్.ప్రసాద్,రూరల్ అధ్యక్షులు స్వామి,సభ్యులు కాళ్ళ సూర్య ప్రకాష్,దొండా రమేష్,ఎల్లాజీ,అప్పలరెడ్డి,వినోద్,విజయ్ కుమార్