భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయితీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం బలపరచిన అభ్యర్థిగా యరబాల సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
గతంలో రేఖవానిపాలెం పంచాయితీకి యరబాల సత్యనారాయణ 2002 లో ఏకగ్రీవంగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టారు.
తరవాత ఆయన భార్య యరబాల లక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్ గా పనిచేసారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులతో కలిసి శుక్రవారం భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా యరబాల సత్యనారాయణ మాట్లాడుతూ రేఖవానిపాలెం ప్రజల సమస్యలను తీర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు.
గతంలో తమ పదవీకాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, ఇక ముందు కూడా పంచాయితీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన చెప్పారు.
గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు పెట్టుకుని ప్రజలు తనను తప్పక గెలిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ భీమిలి
శ్రీనివాస రావు