విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లిఖార్జున.

విశాఖ పట్నం, నవంబరు, 15: విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక ల పోలింగ్  సరళిని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పరిశీలించారు. 31వ వార్డు కు సంబందించి 8,9,10,11,12 పోలింగ్ కేంద్రాలను, జి.వి.ఎం .సి రమాదేవిభానోజీరావు ప్రాధమిక ఉన్నత పాఠశాల,  సెంట్ జోషప్ సెకండరీ స్కూల్ మల్కాపురం 61వ వార్డు 7వ పోలింగ్ కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ పరిశీలించి పోలింగ్ సిబ్బందిని, అధికారులను పోలింగ్ వివరాలపై అడిగి తెలుసుకున్నారు.  పోలింగ్ పూర్తి అయ్యేవరకు  సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగ కుండా పోలీస్ సిబ్బంది  పూర్తి బందోబస్తుతో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. 
జారీః ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం