వేములవలస అభివృద్ధి కి సహకారం అందించా ల ని ఎ న్. హెచ్. ఎ. అధికారులకు వినతి

ఎన్. హెచ్. ఎ. అధికారులతో
 కోరాడ నాగభూషణరావు భేటి
ఆనందపురం మండలంలోని వేములవలస పూల మార్కెట్ నుండి గ్రామంలో వరకు కాలువలు ఏర్పాటు చేసి రోడ్డుకు ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజీనీ స్టేట్ బ్యాంకు వరకు   విస్తరించాలని మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు  కోరాడ నాగభూషణరావు కోరారు. ఈ సందర్భంగా  ఆయన నేషనల్ హైవే అధికారులతో మంగళవారం భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించారు.అలాగే హైవేని ఆనుకొనివున్న సర్వీస్ రోడ్లకు తారు రోడ్డు వేయాలని, రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, పతివాడ నరసింగరావు, నాచు మురళి తదితరులు పాల్గొన్నారు.