విజయవంతంగా డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయ

యలమంచిలి, అక్టోబర్ 08( జనసేవ న్యూస్): 

యలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీ సుమారు 145 కోట్లు మూలధన వ్యయములో 0.80 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ని నెలకొల్పుటకు గాను ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. 

ఈ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల రెడ్డి మరియు అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి సీతా రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు . 

ఈ యొక్క సిమెంటు గ్రైండింగ్ యూనిట్ ప్రతిపాదిత స్థలములో పర్యావరణ మరియు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును ఆంద్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండల, 

ప్రాంతీయ కార్యాలయము, విశాఖపట్నం వారు నిర్వహించడం జరిగినది.సమీప గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో తమ అంగీకారాన్ని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ యలమంచిలి చుట్టుపక్కల మరియు విశాఖపట్నం జిల్లాలో అనేక కంపెనీలు రావడం ఆనందదాయకంగా ఉంది అని ఈ ఘనత అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం అన్నారు. 

ఉన్న అన్ని కంపెనీలు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని, స్థలాలను ఇచ్చిన గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరగుపరచాలని,

 కంపెనీ పరిసరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల స్వచ్ఛత కాపాడాలని డెక్కన్ కంపెనీ ప్రతినిధులను కోరారు. యలమంచిలి మండల ఎంపీపీ బోదెపు గోవింద్ మాట్లాడుతూ సమీపంలో ఉన్న గ్రామాలలోని రైతులలో ఈ కంపెనీ పట్ల ఉన్న సందేహాలను తీర్చేలా ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. 

పురుషోత్తపురం మాజీ సర్పంచ్, వైస్ ఎంపిపి అయిన రాజాన శేషు మాట్లాడుతూ పర్యావరణ హితంగా ఉండే కంపెనీ వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నామని అయితే భూములు ఇచ్చిన వారందరూ సన్నకారు రైతులే కావున వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. 

అన్ని రకాల విద్యావంతులు ,టెక్నికల్ కోర్సులు చేసిన అనేకమంది యువతీ యువకులు ఉన్నారని తెలిపారు. ప్రసాద్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు,సీనియర్ జనరల్ మేనేజరు రాఘవేంద్ర వర్మ, జనరల్ మేనేజర్ నాగ మహేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు, 

యలమంచిలి మున్సిపల్ వైస్ ఛైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, యలమంచిలి ఎంపిపి బోదెపు గోవింద్,వైస్ ఎంపీపీ రాజాన శేషు, బొద్దపు ఎర్రయ్య దొర, కొత్తలి సర్పంచ్ రాజు,రేగుపాలెం సర్పంచ్ రాజాన సత్యవతి, పురుషోత్తపురం మాజీ మండల ప్రెసిడెంట్ విజయ్ బాబు,పోతిరెడ్డిపాలెం మరియు బయ్యవరం సర్పంచ్ లు, యలమంచిలి డెక్కన్ సిమెంట్ డీలర్ ఎం.కాశీ, పడాల శ్రీను, రాము మరియు సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


Reporter
RS నాయడు యలమంచిలి