వైసీపీ పై విద్యార్థి, యువత తిరగబడే రోజులొచ్చాయి - తెదేపా నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు

 *భీమిలి* : 
రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని నమ్మించి మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం పై యువత, విద్యార్థి లోకం తిరగబడే రోజులు తలెత్తాయని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ రాజాబాబు అన్నారు. ఆ పార్టీ అనుబంధ కమిటీ తెలుగునాడు విద్యార్థి సమైక్య (టీఎన్ఎస్ఎఫ్) ఇటీవల నియమించిన రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధి గా నియమితులైన నియోజకవర్గానికి చెందిన లెంక సురేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు గోలగాని కిషోర్, బోని సురేష్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర కమిటీలో తనను నియమించినందుకు రాజాబాబు కు శాలువా, పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి మోసపూరిత మాటలు విని ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు నేడు రోడ్డున పడ్డారని, వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కొత్త పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వలన యువత కూలీ పనులు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని, జాబ్ లెస్ క్యాలెండర్ ను విడుదల చేసి విద్యార్థులను మోసం చేస్తూ నేడు మద్యం షాపులు, వాలంటీర్ ఉద్యోగాల పేరుతో విద్యార్థి, యువతను మోసాగిస్తున్నారని రాజాబాబు విమర్శించారు.

Reporter
సురేశ్