రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరిస్తారాఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ


పసుపు నీలి మధ్య నలిగిపోతున్న ఆంధ్ర ప్రజలు.
ఈరోజు అనగా గురువారం కాకినాడలో కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి వర్యులు శ్రీ ఎమ్ ఎమ్ పల్లంరాజు,మాజీ ఎమ్ ఎల్  మరియు ఏఐసీసీ సెక్రెటరీ రుద్రరాజుగారు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు ఈస్ట్ గోదావరి ఇంచార్జి జమ్ము ఆదినారాయణ కాకినాడ సిటీ నూతన ప్రెసిడెంట్ ని ఈమధ్యనే ఏపీసీసీ అధ్యక్షులు డా' సాకే శైలజానాథ్ ప్రకటించారు.
శ్రీ గాంధీ రాజు సిటీ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో జమ్ము మాట్లాడుతూ...
ఆంద్రా మరో బీహార్ కానుందా !
ప్రశ్నించేందుకు నోళ్లు లేవా !
కర్రలు కత్తులతో జవాబులు దొరుకునా !
మీ తప్పులను ఎత్తి చూపకూడదా ?

రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరిస్తారా ?
 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ  మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సరిగా పనిచేస్తే రాష్ట్రం ఇలా తయారయ్యేది కాదన్నారు. మంత్రులను జగన్ ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎద్దేవాచేశారు. అంటే మీ తప్పులను ఎత్తి చూపకూడదా? కీర్తిస్తూ ఉండాలా? అని జమ్మూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమనే వాస్తవం జగన్ గుర్తించాలన్నారు. నిన్నటి దాడి ఘటనలో దోషులను చట్టపరంగా శిక్షించాలని జమ్ము డిమాండ్ చేశారు.  ముఖ్యమంత్రి ప్రజల గురించి కాస్త ఆలోచించాలని సూచించారు. 
శాంతి భద్రతల సమస్య ఉందని, ప్రజల నిరసన గళాలను వినిపించే పరిష్టితి లేదని ఎక్కడ నోరు విప్పవచ్చో  ఎక్కడ 144 సెక్షన్ ఉందో తెలియని పరిస్థితి ఉంది అన్నారు. ప్రతిపక్షములో ఉండగా ముఖ్యమంత్రి రాష్ట్రమంతా తిరిగారు. బాష గురించి మీరు మాట్లాడితే ఎలా ? మీకు భజన చేసే వారు ఇది అంతం కాదిది ఆరంభం అంటున్నారని,  ముఖ్యమంత్రిని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీకి పట్టిన గతి పడుతుందని ఓ మంత్రి వ్యాఖ్యానించడాన్ని చూస్తే రాష్ట్రంలో ఏం జరుగుతోందో  అర్థమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో  విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఏదని ప్రశ్నించారు.
 అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న వారు ఏం చేసినా సాగుతుందన్న మొండి వైఖరి విడనాడాలని సూచించారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. అధికార పార్టీ నాయకులు (ఎమ్యెల్యే, మంత్రులు) తమ భాష, వ్యవహార శైలి అదుపులోపెట్టించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి వున్నదని ఆయన సూచించారు. జరిగిన దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని,  డిమాండ్ చేశారు.
వీటన్నిటికీ జవాబు ఒక్కటే.
నోటిదురుసుకి పనిమాని ప్రజలు బాగోగులు చూసుకునేవారని నాయకులంటారు.